తెలుగు ఓటిటి ఆహా లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 యొక్క లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో కొంతసేపటి క్రితమే విడుదలయ్యింది. ఈసారి అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ 90 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమ విజయానికి గుర్తుగా దిగ్గజ ఫిలింమేకర్స్ అల్లు అరవింద్, కే రాఘవేంద్రరావు , డి సురేష్ బాబు, కోదండ రామిరెడ్డి గార్లు హాజరై ఎన్నో విశేషాలను పంచుకున్నారు. అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గార్లతో బాలయ్య ఫన్ చిట్ ఛాట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. మరి, ఫుల్ ఎపిసోడ్ లో ఈ ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ ఏరేంజులో ఉండబోతున్నాయని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పోతే, ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2న అంటే ేపు రాత్రి తొమ్మిదింటి నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది.