అడివిశేష్ నటిస్తున్న కొత్త చిత్రం "హిట్ 2" డిసెంబర్ 2న అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఆల్రెడీ నిన్నటి నుండి ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హిట్ 2 టీజర్, ట్రైలర్, అడివిశేష్... క్రేజ్ కారణంగా మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. విశేషమేంటంటే, USA లో హిట్ 2 ప్రీ సేల్స్ సూపర్ పాజిటివ్ నెంబర్ తో స్టార్ట్ అయ్యాయి. నిన్నే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, అప్పుడే USA లో 125K డాలర్స్ ను రాబట్టింది ఈ సినిమా. దీంతో ప్రేక్షకుల్లో హిట్ 2 పై ఎంతటి భారీ అంచనాలున్నాయో క్లియర్ గా అర్ధమవుతుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.