కన్నడ సినీపరిశ్రమ నుండి రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "విజయానంద్". ఇందులో నిహాల్, సిరి ప్రహ్లాద్ జంటగా నటిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి ఫేమస్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన విజయ్ శంఖేశ్వర్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రు. రిషిక శర్మ డైరెక్షన్ చేస్తున్నారు.
రీసెంట్గానే విజయానంద్ ట్రైలర్ విడుదల కాగా, పాన్ ఇండియా భాషల్లో ఈ ట్రైలర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. 3 కోట్ల వ్యూస్ తో ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉన్నట్టు తెలుస్తుంది.
VRL ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆనంద్ శంఖేశ్వర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వినయ ప్రసాద్, భరత్ బోపన్న, అనంత్ నాగ్, షైన్ శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.