ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపేంద్ర - సుదీప్ "కబ్జా" హిందీ టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 02:47 PM

కన్నడ సినీపరిశ్రమ నుండి రాబోతున్న మరో అతిపెద్ద బిగ్ స్క్రీన్ ఎంటర్టైనర్ "కబ్జా". ఇందులో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటిస్తున్నారు. శ్రేయాశరణ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. R చంద్రు డైరెక్షన్లో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క టీజర్ కొన్ని వారాల క్రితం విడుదల కాగా, ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది.


తాజాగా కబ్జా టీజర్ హిందీ భాషలో విడుదలైంది. హిందీలో కబ్జా టీజర్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. పోతే, ఈ సినిమా వచ్చే ఏడాది కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషలలో విడుదల కాబోతుంది. 


శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైసెస్ తో కలిసి అలంకార్ పాండియన్, ఆనంద్ పండిట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com