టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కీరోల్ ప్లే చేస్తున్న చిత్రం "ముఖచిత్రం". నిన్నే ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల కాగా, 24 గంటల్లోనే 1 మిలియన్ కు పైగా వ్యూస్, 40కే + ప్లస్ లైక్స్ తెచ్చుకుని యూట్యూబ్ #3 పొజిషన్ లో దూసుకుపోతుంది. నేషనల్ అవార్డు విన్నర్, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ కంటెంట్ - డైలాగ్స్, గంగాధర్ టేకింగ్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన వెరసి ముఖచిత్రం ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు మంచి హైప్స్ క్రియేట్ చేసింది.
వికాస్ వసిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 9వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa