శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 2' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అడివి శేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా తొలి షోల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం.
రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ 2' కి సంగీతం అందించారు.