సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలోని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను స్పెయిన్, యుఎఇ, టర్కీ, రష్యా మరియు సైబీరియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్‌లలో 8 దేశాల్లో చిత్రీకరించినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని వీడియో గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 25, 2023న విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.