ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహం వ్యాపారవేత్త రవి ప్రక్యాతో ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నిర్మాత అల్లు అరవింద్, బండ్ల గణేశ్ వంటి వారితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కాగా, గుణశేఖర్ దర్శకత్వంతో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాకు నీలిమ నిర్మాతగా వ్యవహరించారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాను కూడా నీలిమ నిర్మించారు.