హీరోయిన్ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారికి నచ్చేలా బతకడం జీవితంలో అత్యంత కష్టమైన పని అని అన్నారు. అందరికీ నచ్చేలా బట్టలు వేసుకోవడం, అందరికీ నచ్చేలా మాట్లాడటం, ప్రవర్తించడం జీవితంలో అత్యంత కష్టమైన పనులని, మనల్ని ఎదుటివారు ఎలా ఆమోదిస్తున్నారు అనేది మారిపోతుంటుందని, అదే అత్యంత ప్రమాదకరమని శృతి వ్యాఖ్యానించారు. అందుకే మనసుకి సంతోషంగా అనిపించేలా ఉండటం చాలా ముఖ్యమని, తాను ఎల్లప్పడూ అలానే ఉంటానని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.