ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేజీ పై ఆర్ఆర్ఆర్ పాటకు రాంచరణ్ స్టెప్పులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 11:55 AM

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కు ఎన్డీటీవీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ అవార్డును రామ్ చరణ్ కు అందజేశారు. ఈ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ పాటకు డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నాడు. చిత్రంలోని నాచో నాచో పాటకు స్టెప్పులు వేసి అలరించాడు. ఈ పాటకు స్టెప్పులు వేయమని యాంకర్ మొదట కోరగా రాం చరణ్ తిరస్కరించాడు. యాంకర్ మళ్లీ కోరడంతో మరో ఇద్దరితో కలిసి రామ్ చరణ్ స్టేజీపై స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com