పుష్ప సినిమా ఉత్తరాదిన ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చెయ్యకుండానే అక్కడ వంద కోట్ల కలెక్షన్లను చేసి... ఎక్కడా తగ్గేదేలే అనిపించుకుంది.
పుష్ప ఘనవిజయంతో అల్లు అర్జున్ కి హిందీ అవకాశాలు వెల్లువెత్తాయి. ఐతే, బన్నీ మంచి టైం, స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ త్వరలోనే బాలీవుడ్ బాట పట్టబోతున్నాడని తెలుస్తుంది.
గోల్మాల్, చెన్నై ఎక్స్ప్రెస్, సూర్యవన్షి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రోహిత్ శెట్టి తెరకెక్కించబోయే పాన్ ఇండియా పవర్ఫుల్ మల్టీస్టారర్ కాప్ స్టోరీలో బన్నీ కూడా నటిస్తే బాగుంటుందని, ఇందుకోసం ఆయనతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం బన్నీ పుష్ప రష్యా ప్రమోషన్స్ లో , రోహిత్ సర్కస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో వీరిద్దరూ ఈ రెండింటి నుండి ఫ్రీ ఐన తరవాత చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తుంది.
విశేషమేంటంటే, ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, కార్తీ లతో బన్నీ నటించడం. మరొక ఇంటరెస్టింగ్ విషయమేంటంటే, సీనియర్ బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ స్పెషల్ గెస్ట్ రోల్స్ లో కనిపించడం. ఇప్పటివరకైతే ఈ విషయం మీడియావర్గంలో నడుస్తున్న ఒక వార్త మాత్రమే. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.