తెలుగు ఓటిటి ఆహాలోకి రీసెంట్గానే "అహనా పెళ్ళంట" అనే వెబ్ సిరీస్ రిలీజై ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆహా లో 75 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ ను అందుకుని హిలేరియస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ వెబ్ సిరీస్ లో యంగ్ హీరో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆమని, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తమడా మీడియా నిర్మించింది.