మేజర్ సినిమా తదుపరి అడివిశేష్ నుండి వచ్చిన తాజా చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ 2 నిన్నే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.
ఈ నేపథ్యంలో శేష్ మరియు ఒక స్టార్ హీరోయిన్ మధ్య నడిచిన సోషల్ మీడియా సంభాషణ ఆసక్తిని కలిగిస్తుంది. హిట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో సమంత లాంటి ఫిమేల్ లీడ్ రోల్స్ కూడా ఉంటే బాగుంటుందని ఒక నెటిజన్ అభిప్రాయపడగా, అందుకు శేష్ స్పందిస్తూ... వెరీ గుడ్ ఐడియా... మీరేమంటారు సమంత... అని సమంత ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసారు. అందుకు సమంత... ఒక పవర్ఫుల్ కాప్... జోక్ చేస్తున్నారు.. హిట్ 2 సూపర్ హిట్టయ్యినందుకు కంగ్రాట్యులేషన్స్ ... అని బదులిచ్చింది.
ప్రస్తుతం శేష్ మరియు సమంతల మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ వైరల్ గా మారింది.