RRR సినిమాతో రాజమౌళి ఖ్యాతి మరింత పెరిగిందన్న విషయం అందరికి తెలిసిందే. మార్చి నెలలో విడుదలైన RRR హవా ఇండియాలో ముగిసినా, విదేశాలలో ఇంకా కొనసాగడం విశేషం.
ఇప్పటికే హాలీవుడ్ లెవెల్లో సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డు, సన్సెట్ సర్కిల్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డులను అందుకున్న RRR సినిమా మరొక ప్రెస్టీజియస్ అవార్డును అందుకోవడం విశేషం. ఐతే, ఈసారి RRR సినిమాకు కాకుండా, రాజమౌళికి డైరెక్ట్ అవార్డు వచ్చింది. న్యూయార్క్ క్రిటిక్స్ సర్కిల్ - బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఈఏడాది మన రాజమౌళిగారు అందుకోబోతున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన జరగడంతో, రాజమౌళికి ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.