రోహిత్ బహెల్, అపర్ణా జనార్ధనన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "లవ్ యూ రామ్". ఈ సినిమాకు DY చౌదరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మన ఎంటర్టైన్మెంట్, శ్రీ చక్ర ఫిలిమ్స్ బ్యానర్లపై Dy చౌదరి, కే దశరధ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కే వేదా సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. చిన్నప్పటి నుండి కలిసి మెలిసి పెరిగిన ఇద్దరు పిల్లల ప్రేమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాతోనే దశరధ్ డైరెక్టర్ నుండి నిర్మాతగా మారనున్నారు. దశరధ్ గతంలో సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు.