కోలీవుడ్ స్టార్ హీరో శింబు (STR) హీరోగా సినిమాలు మాత్రమే చెయ్యక, గాయకుడిగా పాటలు కూడా పాడతారన్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు రీసెంట్గానే రామ్ పోతినేని "ది వారియర్" లో చార్ట్ బస్టర్ బులెట్ బండి సాంగ్ పాడిన శింబు నిఖిల్ సిద్దార్ధ్ అప్ కమింగ్ మూవీ "18 పేజెస్" లో సెకండ్ సింగిల్ 'టైం ఇవ్వు పిల్లా' పాటను పాడారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న వారిసు లో కూడా STR పాట పాడారని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై అధికారిక అప్డేట్ వచ్చింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కాబోతున్న వారిసు సెకండ్ సింగిల్ థీ తలపతి పాటను హీరో STR పాడారని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది.
పోతే, ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.