ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ ఎస్ ఎస్ రాజమౌళి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
రాజమౌళి అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారే రచయితగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ సినిమాకు కూడా విజయేంద్రప్రసాద్ గారే కథను సమకూరుస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ... SSMB 29 లో మహేష్ ను హీరోగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనే విషయంపై చక్కని క్లారిటీ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్సెస్ ను గనక ఒక్కసారి గమనిస్తే, చాలా ఇంటెన్స్ గా నటిస్తారు. ఆయన పాత్రలోని క్రోధాన్ని బయటకు తీసుకురావడం ఏ రచయితకైనా చాలా సింపుల్. మహేష్ తన ఎమోషన్స్ ను అంత ఈజీగా చేంజ్ చెయ్యగలరు. రాజమౌళికి ఎప్పటినుండో ఫారెస్ట్ బేస్డ్ ఎడ్వెంచరస్ థ్రిల్లర్ చెయ్యాలని ఆశగా ఉండేది. ఇలాంటి సినిమాకు మహేష్ ఐతే సూపర్ సూట్ అవుతాడని ఫిక్స్ అయ్యి, మహేష్ ను హీరోగా కథను ప్రిపేర్ చేస్తున్నాం... అంటూ చెప్పుకొచ్చారు.