దగ్గుబాటి అభిరాం తెలుగు వెండితెరకు హీరోగా పరిచయమవుతున్న చిత్రం "అహింస". తేజ మార్క్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుంది. సదా, కమల్ కామరాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రకారం, అహింస పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తామని తెలుపుతూ స్పెషల్ పోస్టర్స్ ను మేకర్స్ విడుదల చేసారు.
ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.