కరోనా కాలంలో దేశ ప్రజలు మాత్రమే కాక ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కంపించిపోయింది ..అంతటి దుర్భర పరిస్థితుల్లో ఎంతోమంది గొప్ప మనసు కలవారు తమ దయా గుణాన్ని చాటుకోవడం ద్వారా ఎంతోమంది సహాయం పొందారు. అలాంటి వారిలో నటుడు సోనూసూద్ ఒకరు. కరోనా కాలంలో యాక్టర్ సోనూసూద్ పేరు జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. సినిమాల్లో క్రూరమైన విలన్ గా నటించే సోనూసూద్ రియల్ లైఫ్ లో వెన్న కన్నా సున్నితమైన మనసు కలవాడు. కరోనా టైం లో ఎంతో మందికి ఎన్నోరకాలుగా సహాయం చేసి, తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
ఇప్పటికే పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ, పలు అవార్డులను సొంతం చేసుకున్న సోనూసూద్ తాజాగా NDTV ట్రూ లెజెండ్ - హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి