ఎప్పటినుండో విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తున్న సత్యదేవ్, తమన్నాల "గుర్తుందా శీతాకాలం" ఎట్టకేలకు ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితమే గుర్తుందా శీతాకాలం రిలీజ్ ట్రైలర్ విడుదలయ్యింది. యూట్యూబులో 2M వ్యూస్ తో, ట్రెండింగ్ లో గుర్తుందా శీతాకాలం ట్రైలర్ కొనసాగుతుంది. ప్లీజింగ్ కంటెంట్, ముఖ్యంగా సత్యదేవ్ లవర్ బాయ్ గెటప్... ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
నాగశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.