ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బ్లస్టర్ అయి ఈ నెల 8న రష్యాలోనూ విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక, దేవిశ్రీ రష్యాలోనే ఉండి ప్రీమియర్స్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత వై.రవిశంకర్ పుష్ప-2పై కీలక అప్ డేట్ ఇచ్చారు. పుష్ప-2ను భారత్, రష్యాలో ఒకే తేదీన విడుదల చేస్తామని చెప్పారు. పలు దేశాల్లో ఏక కాలంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.