కేజీఎఫ్, కేజీఎఫ్ – 2 సినిమాలను తెరకెక్కించిన తర్వాత హోంబోలే ఫిల్మ్స్ పేరు మారుమోగిపోతుంది. ఇక దక్షిణాది భాషల్లో సినిమాలు చేపడతామని ప్రకటించిన సంస్థ అధినేత కిరగందర్ ఇప్పటికే టాలీవుడ్‌లో సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటు కోలీవుడ్‌లో ఇప్పటికే సరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో శింబు హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరగ్గా తాజాగా ఈ సంస్థలో కీర్తి సురేష్ నటించబోతున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నటి కీర్తి సురేష్ చేతిలో తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న బోలా శంకర్, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న సైరన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.