తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. నటుడు హరి వైరవన్ (38) శుక్రవారం అర్ధరాత్రి మదురైలో కన్నుమూశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హరి వైరవన్ అనారోగ్యానికి గురి కాగా వైద్య పరీక్షలో కిడ్నీ పాడైపోయిందని తెలిసింది. అప్పటి నుంచి మదురైలో వైద్య చికిత్స పొందుతూ వచ్చారు. ఆరోగ్యపరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు. కాగా హరి వైరవన్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక సుశీంద్రన్ దర్శకత్వం వహించిన వెన్నెలా కబడ్డీ కుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు.