నిన్న సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మేరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ తో సినిమా చెయ్యబోతున్నట్టు కొంతసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య గారు ఈ సినిమాను నిర్మించనున్నారు. రవి కే చంద్రన్ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కొంతసేపటి క్రితమే విడుదలైంది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో "సాహో" చేసి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన సుజీత్ ఆపై మూడేళ్ళ విరామం తీసుకుని, లేటెస్ట్ గా పవర్ స్టార్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించి, మరొకసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. శర్వానంద్ తో "రన్ రాజా రన్" తెరకెక్కించి, తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సుజీత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
RRR వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తదుపరి DVV దానయ్య గారు నిర్మిస్తున్న చిత్రమిదే.