తను పనిచేసే సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో క్రేజీ అప్డేట్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ , తాజాగా ట్విట్టర్ లో వీరసింహారెడ్డి ఇంప్రూవ్మెంట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. "వీరసింహారెడ్డి పాటల కంపోజిషన్స్ ముగిసిందని, BGM పనులు షురూ" అంటూ ట్వీట్ చేసి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రిలతో కలిసి దిగిన పిక్ ను షేర్ చేసారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే నెల 12న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.