నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కలయికలో త్వరలోనే ఒక సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉండడంతో, అనిల్ సినిమా వచ్చే జనవారికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.
నిన్నటి వరకు ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా నటిస్తుందని ప్రచారం జరిగింది. ఈ వార్తలను కేవలం పుకార్లని సోనాక్షి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో బాలయ్య సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఐతే, ప్రియాంక మెయిన్ హీరోయినా లేక సెకండ్ హీరోయినా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ప్రియాంక జవాల్కర్ పై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట కూడా. విజయ్ దేవరకొండ "టాక్సీవాలా", కిరణ్ అబ్బవరం "SR కళ్యాణమండపం" వంటి సూపర్ హిట్ చిత్రాలలో ప్రియాంక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది.