కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "కెప్టెన్ మిల్లర్". అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీరోల్ లో నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితాసతీష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, కెప్టెన్ మిల్లర్ అన్నయ్య పాత్రలో శాండల్ వుడ్ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (శివన్న) గారు స్పెషల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు శివరాజ్ కుమార్ గారు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.