శుక్రవారం థియేటర్లకు వచ్చిన హిట్ 2 సూపర్ పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుని, హౌస్ ఫుల్ ధియేటర్లతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ నంబర్లను నమోదు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు పదకొండు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన రెండో రోజు కూడా అదే రేంజులో అంటే పదకొండు కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. పదిహేను కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లకు వచ్చిన హిట్ 2 మూడు రోజుల్లోనే అంటే ఈ ఆదివారంతోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కానుంది. ఇక, USA లో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసి, వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ల బాట పట్టిన హిట్ 2 నిన్నే అంటే శనివారమే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 సినిమాను వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.