మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకున్న తదుపరి SDT 15 లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సాయిధరమ్ కు 15వ సినిమా అందుకే, SDT 15 అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ దండు డైరెక్టర్. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టైటిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు డిసెంబర్ 7వ తేదీన SDT 15 టైటిల్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ కాబోతుందంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. పోతే, ఈ గ్లిమ్స్ వీడియోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చెయ్యబోతున్నట్టు ఒక టాక్ ఐతే మీడియాలో నడుస్తుంది. మరి, ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.