"రౌడీ బాయ్స్" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పిన యంగ్ హీరో ఆశీష్ రెడ్డి. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పక్కా లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఆశీష్ రెండవ సినిమా "సెల్ఫిష్" అధికారిక ప్రకటన జరిగింది. సెల్ఫిష్ సినిమాకు సంబంధించి ఈ రోజు నుండే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సినిమాకు కాశీ విశాల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa