సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమా సెప్టెంబర్ 29, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'నేనే వస్తున్నా' అనే టైటిల్ తో విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 11, 2022న మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శించబడుతుందని సమాచారం.
ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa