ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్ ని: అద్వానీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 02:16 PM

'భరత్ అనే నేను' సినిమాలో మహేశ్ బాబు జోడీ కట్టిన కైరా అద్వాని, తన గ్లామర్ తో కుర్రకారు మతులు పోగొట్టేసింది. అంతేకాదు ఆ తరువాత ఆమె చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. చరణ్ సరసన ఆమె కథానాయికగా చేసిన 'వినయ విధేయ రామ' జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది.

తాజా ఇంటర్వ్యూలో కైరా అద్వాని మాట్లాడుతూ .. "నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం .. 'వినయ విధేయ రామ'లో నటనతో పాటు డాన్స్ కి అవకాశం వున్న పాత్ర లభించడం నా అదృష్టం. ప్రస్తుతం హిందీలో 'కబీర్ సింగ్' సినిమా చేస్తున్నాను .. ఇది 'అర్జున్ రెడ్డి'కి రీమేక్. 'కబీర్ సింగ్' సినిమా కోసమే నేను 'అర్జున్ రెడ్డి' చూశాను. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ అభిమానిగా మారిపోయాను. చాలామందికి లాగే నేను విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్ ని. మహేశ్ .. చరణ్ లతో సినిమాలు చేయడం వలన వాళ్ల ఫ్యామిలీస్ తో బాగా పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ లో షూటింగ్ ఉంటే, వాళ్ల ఇంటి భోజనమే చేస్తాను" అని చెప్పుకొచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa