మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న "ధమాకా" చిత్రం నుండి సడెన్ సర్ప్రైజ్ గా దందకడియాల్ లిరికల్ ప్రోమో విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ పూర్తి లిరికల్ వెర్షన్ త్వరలోనే రిలీజ్ కాబోతుందని పేర్కొన్నారు.
నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.