బెంగాలీలపై విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, నటుడు పరేష్ రావల్‌పై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153, 153ఏ, 153బీ, 504, 505, తదితర సెక్షన్లను ఆయనపై మోపారు. బెంగాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పరేష్ రావల్‌పై సీపీఎం బెంగాల్ కార్యదర్శి మహ్మద్ సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు బెంగాలీలు, ఇతర వర్గాల మధ్య ఘర్షణలను ప్రేరేపించడంతో పాటు సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సలీం ఆరోపించారు.