సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం "గుర్తుందా శీతాకాలం". ఇందులో తమన్నా హీరోయిన్. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్‌టైల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రం తెరకెక్కింది. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్ డైరెక్ట్ చేసారు. కాలభైరవ సంగీతం అందించారు. మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి శీతాకాలమా అనే రొమాంటికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఆల్రెడీ ఈ సినిమా నుండి విడుదలైన లిరికల్ సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్న ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.