శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ 2 మూవీ అటు ప్రేక్షకులను, క్రిటిక్స్ ను మాత్రమే కాక పలువురు సినీప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మేరకు కొంతమంది సినీతారలు హిట్ 2 సినిమాను ఒకరేంజులో పొగిడేస్తూ ట్వీట్లు చేసారు.
రీసెంట్గానే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హిట్ 2 సినిమాను చూసి టీం మొత్తాన్ని అభినందించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. తాజాగా హిట్ 2 సినిమాను మరొక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గారు చూసి, చాలా బాగుందంటూ డైరెక్టర్ శైలేష్ కొలను ని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.