చాలా కాలంగా సరైన హిట్స్ లేక బాధపడుతున్న పూరి జగన్నాధ్ గానీ , హీరో రామ్ గానీ కొత్త ఏడాది కలసి రావాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఇద్దరూ కలిసిచేస్తున్న ఇస్మార్ట్ శంకర్. అయితే పూరీ ఈ చిత్ర కథని టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ కే వినిపించాడట. ఆయన ఊహు అన్నాకనే ఈ కథనే రామ్ పోతినేని చెంతకు చేరిందని ఇండస్ట్రీ టాక్. పూరీ, రామ్‌ల కాంబినేషన్‌లో హీరోగా రూపొందుతున్న ” ఇస్మార్ట్ శంకర్ ” కథ ఇదే నని తెలుస్తోంది .
పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో స్టార్ లీగ్ లో చేరిపోయిన విజయ్ దేవరకొండతో తెలంగాణ మాండలికంలో సాగే ఓ సినిమా చేయాలనుకున్నదర్శకులు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ కథ రెడీ చేసుకున్నాడు కానీ విజయ్ దేవరకొండ మాత్రం లైన్ విన్నాక ఈ సినిమా వర్కవుట్ కాదని పూరీ ముఖం మీదే చెప్పాడట ! దాంతో చేసేదిలేక వెనుదిరిగిన పూరీమరిన్ని మార్పులు చేసి హీరో రామ్ పోతినేని కి చెప్పాడు పూరి . విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథకు పూరీ చేసిన మార్పులు రామ్ కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కట్ చేస్తే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు . ఈ సినిమా తో హిట్ కొడతారా ? లేక మళ్ళీ ప్లాప్ తో సరిపెట్టుకుంటారా చూడాలి .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa