తమిళ సినిమాలు రీమేక్ చేయటం మనోళ్లకి కొత్తకాదు. ఇప్పుడిప్పుడే హీరోగా వెలుగులోకి వస్తున్న వాళ్లు కూడా ఈ సినిమాల మీద ఆధారపడుతున్నారు. భారీ సినిమాలను చేస్తూనే ఉన్నా, సక్సెస్ మాత్రం దక్కక పోవటంతో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్‌పై దృష్టి దృష్టి పెట్టాడు . తమిళంలో హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్నట్లు తెలుస్తోంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తాజాగా తేజ దర్శకత్వంలో సీత అనే చిత్రంలో నటిస్తున్నాడు . కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సీత చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఆ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడు బెల్లంకొండ . అందులోనే ఒక చిత్రాన్ని రాచ్చసన్ అనే చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa