కొన్నాళ్ల బట్టి సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ SDT 15 నుండి రేపు ఉదయం పదకొండు గంటలకు టైటిల్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ కాబోతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ గ్లిమ్స్ వీడియోకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆడియన్స్ మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చిత్రబృందం అంతా కలిసి విభిన్న ప్రచారం చేస్తూ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచేస్తున్నారు. ఈ మేరకు SDT 15 టైటిల్ గ్లిమ్స్ ప్రచార పోస్టర్ నుండి ఒక కన్నుతో చూస్తున్న సాయిధరమ్ తేజ్, నిర్మాత BVSN ప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ దండుల పిక్స్ వైరల్ గా మారాయి.
కార్తీక్ దండు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్నారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa