రెబల్ స్టార్ ప్రభాస్, వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతితో ఒక సినిమాకు కమిటయ్యారని, ఆ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ప్రచారం జరుగుతుంది. ఐతే, అధికారికంగా ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ మెయిన్ హీరోయిన్ గా నటించబోతుందట. ఇంకా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారట. ఏ విషయంపై క్లారిటీ లేని ఈ సినిమాకు సంబంధించి మారుతి ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసారు. లేటెస్ట్ షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కాబోతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa