కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసి, దానికి సంబంధించిన వీడియో గ్లింప్సె ని కూడా విడుదల చేశారు. టైటిల్ గ్లింప్స్‌కి జూనియర్ ఎన్టీఆర్ తన గంభీరమైన వాయిస్‌ఓవర్ ఇచ్చారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఆంధ్రాలోని మారుమూల గ్రామానికి వచ్చే ఇంజనీర్‌గా ఆ గ్రామంలో జరిగిన అనుమానాస్పద మరణాల వెనుక కథను తెలుసుకోవడానికి వచ్చిన ఇంజనీర్‌గా కనిపించనున్నారు అని లేటెస్ట్ టాక్.
భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa