ఊర్వశివో రాక్షశివో :
రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 9, 2022న ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహా ప్రకటించింది.
ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ :
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' సినిమా నవంబర్ 4, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ అడ్వెంచరస్ ఫన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 9న సోనీ లివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం.
ట్రావెల్ కామెడీగా సాగే ఈ చిత్రంలో సంతోష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేస్తుంది. బ్రహ్మాజీ, మైమ్ గోపి, సుదర్శన్, సప్తగిరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు.
మాచర్ల నియోజకవర్గం :
MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం డిసెంబర్ 9న ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని సమాచారం.
నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.
యశోద :
హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ డైరెక్షన్ లో సౌత్ ఇండియా సిజ్లింగ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీ నవంబర్ 11, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క తెలుగు తమిళం, హిందీ మరియు ఇతర ప్రధాన భాషా వెర్షన్‌లు డిసెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa