ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వ్యక్తి మా మెగా బ్రదర్స్ మీద 6 సార్లు కామెంట్ చేసాడు : నాగబాబు

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 06, 2019, 01:14 PM

స్టార్ హీరో కం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ఎవరో తెలియదంటూ దుమారం రేపిన మెగా బ్రదర్ నటుడు నాగబాబు తాజాగా ఆ వ్యాఖ్యల వెనుకున్న అసలు నిజాన్ని బయటపెట్టాడు. తాను ఎంతో బాధపడితేనే ఆ మాటలు అన్నానో వివరించారు. తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఆధారాలతో సహా నాగబాబు వివరణ ఇచ్చి సంచలనం రేపారు. తాజాగా నాగబాబు విడుదల చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు మాట్లాడిన మాటలను ఆయన మాటల్లోనే పేర్కొంటే..

నాగబాబు మాట్లాడుతూ ‘‘హలో ఫ్రెండ్స్.. గత కొంత కాలంగా ఒక వ్యక్తి మీద చేస్తున్న కామెంట్స్ కి చాలా వివాదాస్పదంగా ఉన్నాయని చాలా కామెంట్స్ విమర్శలు వచ్చాయి.అందుకే దానికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఇలా వివాదాస్పద అంశాల వైపు వెళ్లను. ఇలాంటి వివాదాలతో మీడియాలో ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న పేరు విలువలు చాలు. నేనెప్పుడు పేరు ప్రఖ్యాతల వెంట పడలేదు’’ అని వివరణ ఇచ్చారు.

తాను బాలక్రిష్ణ పై చేసిన కామెంట్లకు ఒక కారణం ఉందని నాగబాబు వీడియోలో వివరించారు. ‘పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని బాలయ్య అనడంతో తాను కౌంటర్ ఇచ్చానని చాలామంది అనుకున్నారు. ఒక్క మాటకే అంత ఫీల్ అయిపోతే ఎట్లా.? సరే ఇచ్చారేదో ఇచ్చారు కదా మళ్లీ మళ్లీ ఎందుకు ఇవ్వాలని నన్ను కొందరు ప్రశ్నించారు.  దానికి నా సమాధానం ఇదే.. ఆ వ్యక్తి ఇప్పటికి ఆరు సార్లు మా ఫ్యామిలీ మీద మా అన్నాదమ్ముల మీద కామెంట్ చేశారు. దానికి తాను చాలా సరదాగా.. నవ్వుతూ ఫన్నీగా చేశాను తప్ప.. సీరియస్ గా చేయలేదు.. నిజానికి తాను ఆ వ్యక్తి టార్గేట్ చేయలేదు. కానీ 100శాతం మీరు నేను టార్గెట్ చేశారని భావిస్తున్నారు. కానీ ఐదారేళ్లలో ఆయన మాపై చేసిన కామెంట్లను బట్టి తాను విమర్శించాను’ అని నాగబాబు స్పష్టం చేశారు.

‘పవన్ కళ్యాన్ అనే వ్యక్తి మీ తెలుగుదేశం పార్టీకి మీ బావ చంద్రబాబుకు ఎంతో సాయం చేశారు. మీ బావ చంద్రబాబు వచ్చి అడిగితే పోటీచేయకుండా జగన్ గెలవాల్సిన పరిస్థితిలో మద్దతిచ్చి మీ గెలుపునకు కారణమయ్యాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అంటే నాకు తీవ్రంగా బాధేసింది’ అని నాగబాబు వివరించారు.

‘మీ పార్టీకి పనిచేసి.. మీ పార్టీ గెలవడానికి కృషి చేసిన వ్యక్తినే మీరు తెలియదని అన్నప్పుడు.. మీరు తెలియదు అని నేనంటే ఎందుకు అంతగా ఫీలవుతున్నారు.. మీరంటే ఫర్వాలేదు.. తిరిగి మేము అంటే కోపం వచ్చిందా.. ఇది మంచి పద్ధతి కాదు’ అంటూ బాలయ్య పై చేసిన కామెంట్లకు నాగబాబు వివరణ ఇచ్చారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa