ఒకట్రెండు క్షణాల్లో ముగిసిపోయే ఒక షాట్.. అదే ఇప్పుడు యూట్యూబ్‌లో ప్రకంపనలు రేపుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చి పెడుతోంది. ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో ఇప్పటిదాకా 74 లక్షల మంది చూడటం విశేషం. ఇప్పటిదాకా సౌత్ ఇండియాలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా టీజర్‌కు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ టీజర్ పేరిట ఉన్న రికార్డును ‘ప్యారిస్ ప్యారిస్’ బద్దలు కొట్టింది. ఈ టీజర్ ఇంతగా జనాల దృష్టిని ఆకర్షించడానికి కారణమేంటో తెలిసిందే. ఇందులోని బూబ్ ప్రెస్ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అలాంటి బోల్డ్ సీన్‌కు కాజల్ ఒప్పుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa