సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు 72వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న అప్ కమింగ్ సినిమాల నుండి అభిమానులకు స్పెషల్ సర్ప్రైజింగ్ ట్రీట్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రజినీకాంత్ స్పెషల్ అప్పియరెన్స్ రోల్ చేస్తున్న "లాల్ సలామ్" నుండి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. విశేషమేంటంటే, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటించబోతున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa