మాస్ రాజా అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్న 'ధమాకా' ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 06:45 నిమిషాలకు విడుదల కాబోతుంది. రవితేజ గత రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో సాయంత్రం రిలీజ్ కాబోతున్న ధమాకా ట్రైలర్ ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లకు రాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa