ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమికుల దినోత్సవం నాడు అల్లుఅర్జున్ సినిమా స్టార్ట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 07, 2019, 05:19 PM

కొంతకాలంగా బన్నీకి సరైన హిట్ లేదు. 'దువ్వాడ జగన్నాథం' ఫరవాలేదనిపిస్తే, 'నా పేరు సూర్య' ఆ స్థాయిని కూడా అందుకోలేకపోయింది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ కారణంగానే ఆయన విక్రమ్ కుమార్ .. పరశురామ్ వంటి దర్శకుల ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టేసి, త్రివిక్రమ్ తోనే సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు.

వేలంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి. ఆ రెండింటిని మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని బన్నీ ముందుగానే త్రివిక్రమ్ కి చెప్పేశాడట. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa