గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. వీరసింహా రెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ని సుగుణ సుందరి అనే టైటిల్ తో విడుదల చేశారు. థమన్ ఎస్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ మాస్ ట్రాక్‌ను రామ్ మిరియాల మరియు స్నిగ్ధా శర్మ పాడారు. బాలకృష్ణ స్వగ్ మరియు డాన్స్ విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa