ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"వాల్తేరు వీరయ్య" రన్ టైం లాక్డ్ ..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 05:41 PM

మెగాస్టార్ చిరంజీవి గారి నుండి రాబోతున్న ఔటండౌట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య". మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శృతి హాసన్, బాబీ సింహ, క్యాథెరిన్ ట్రెసా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


పోతే, వాల్తేరు వీరయ్య రన్ టైం లాక్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు వాల్తేరు వీరయ్య రెండు గంటల ముప్పై మూడు నిమిషాలపాటుగా వెండితెరపై సందడి చెయ్యనున్నారట. ఈ విషయంపై అతి త్వరలోనే మేకర్స్ నుండి క్లారిటీ రానుంది.


సంక్రాంతి కానుకగా జనవరి 13, 2023లో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జనవరి 8న జరగబోతుందని టాక్. ఈ విషయం పై త్వరలోనే అఫీషియల్ క్లారిటీ రాబోతుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa