ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కొరమీను" నుండి 'మీనాచ్చి మీనాచ్చి' సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 06:19 PM

ఆనంద్ రవి, కిషోరీ ధాత్రిక్ జంటగా నటిస్తున్న చిత్రం "కొరమీను". శ్రీపతి కర్రీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్నారు. మాంగో మాస్ మీడియా సమర్పిస్తుంది. 


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'మీనాచ్చి మీనాచ్చి' అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియో విడుదలైంది. హీరో హీరోయిన్ల మధ్య బ్యూటిఫుల్ లవ్ సాంగ్ గా, మెలోడియస్ మ్యూజిక్ తో ఈ పాట యువతను ఆకట్టుకుంటుంది. అనంత నారాయణ్ స్వరపరిచిన ఈ సాంగ్ ను సూరజ్ సంతోష్ పాడారు. పూర్ణాచారి లిరిక్స్ అందించారు.


రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్, శత్రు, హరీష్ ఉత్తమన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa